తెలంగాణలో పోడు సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.అర్హులకు భూములు ఇవ్వడం లేదన్నారు.
పోడు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అనాటి నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు.సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
ఒకరిపై ఈడీ.మరొకరిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై మాట్లాడకూడదనే సోదాలు చేయిస్తున్నారని వెల్లడించారు.