తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.ఎస్వీలోని యూజీ హాస్టల్ లో తెల్లవారుజామున ఇరువురు విద్యార్థులపై మరో విద్యార్థి దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో నందలూరు మహేశ్ అనే విద్యార్థిని సర్జికల్ బ్లేడ్ తో గొంతుకోసి తలపై స్టంపుతో దాడి చేసిన గణేశ్ మరో విద్యార్థి ప్రవీణ్ పై కూడా దాడి చేశాడని సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం వివాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గణేశ్ కోసం గాలిస్తున్నారు.కాగా గణేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.