చిరంజీవి అసలు సత్తా తెలియాలంటే ఆ మూవీ రిలీజయ్యే వరకు ఆగాలా?

మెగాస్టార్ చిరంజీవి కరెక్ట్ మార్కెట్ ఎంత అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు.చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలలో నటించిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

 Chiranjeevi Market Depends On Bhoala Shankar Movie Details Here Goes Viral In S-TeluguStop.com

అయితే చిరంజీవి అసలు సత్తా తెలియాలంటే మాత్రం భోళా శంకర్ సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతోంది.షాడో సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమా రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ రిజల్ట్ విషయంలో ఒకింత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.మరోవైపు చిరంజీవికి మెహర్ రమేష్ బంధువు కావడం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కిందని కొంతమంది భావిస్తారు.

Telugu Bhoala Shankar, Chiranjeevi, Godfather, Keerthy Suresh, Meher Ramesh, Tam

భోళా శంకర్ లో కీర్తి సురేష్, తమన్నా కూడా నటిస్తుండటంతో ఈ సినిమాకు స్టార్ అట్రాక్షన్ ఎక్కువగానే ఉందనే కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తుండటం గమనార్హం.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సక్సెస్ లతో జోరుమీదున్న చిరంజీవి మరింత హుషారుగా ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.కోల్ కతాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

Telugu Bhoala Shankar, Chiranjeevi, Godfather, Keerthy Suresh, Meher Ramesh, Tam

వేదాళం సినిమాకు రీమేక్ గా సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాలో చాలా మార్పులు జరిగాయి.చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.మార్కెట్ పెరగడంతో చిరంజీవి పారితోషికాన్ని అమాంతం పెంచేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube