పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan ) తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.ఇక ఈయన తెలంగాణలో బిజెపి ( BJP) తో పొత్తు పెట్టుకున్న సమయంలోనే ఈ ప్రభావం కచ్చితంగా ఏపీ పాలిటిక్స్ పై పడుతుంది అని అందరూ ఎంత మొత్తుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకుండా బిజెపితో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేశారు.
ఇక ఆ 8 స్థానాల్లో ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు.అయితే ఈ ప్రభావం కచ్చితంగా ఏపీ లో కనిపిస్తుంది అని అందరూ భావిస్తున్నారు.
అయితే తెలంగాణలో జనసేనకు రిజల్ట్ ఇలా వచ్చినందుకుగానూ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిరంజీవి ( Chiranjeevi) పై చేసిన కామెంట్లు అటు రాజకీయంగా ఇటు కుటుంబంలో దుమారం సృష్టించాయి.మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఈయనకు అభిమానులు ఉన్నారు కానీ ఓట్లు వేసే వారు ఎవరూ లేకపోవడంతో ఈయన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా గెలుపొందలేదు.
దాంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాల నుండి తప్పుకున్నారు.అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన సమయంలో ఈయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
అన్న పార్టీ పెట్టి వెలిగించాడు ఇక తమ్ముడు పార్టీ పెట్టి ఏం చేస్తాడో అంటూ చాలా రకాలుగా దెప్పి పొడిచారు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే నా సోదరుడు చిరంజీవి ప్రజలకు విధేయుడుగా ఉండకుండా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం ( Prajarajyam ) పార్టీని విలీనం చేయడం వల్లే నన్ను ఎవరు నమ్మడం లేదు.అంటూ సంచలన కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్.
చిరంజీవి చేసిన పని వల్లే తనని రాజకీయాల్లో ఎవరూ కూడా నమ్మడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆయన ఫెయిల్యూర్ వల్ల తన రాజకీయ జీవితంపై ప్రభావం పడిందని,అందుకే తనకు గెలుపు వరించడం లేదు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయంగా అటు మెగా ఫ్యాన్స్ లో దుమారం సృష్టించాయి.ఈయన కామెంట్ల పై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో భగ్గుమంటున్నారు.ప్రస్తుతం అన్న చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి పవన్ కళ్యాణ్ గురవుతున్నారు
.