ఆదివారం రోజు రాత్రి ‘లైన్ ఆఫ్ కంట్రోల్'(LAC) దగ్గర తమ సైనికుడు కనిపీయకుండా పోయాడని ‘చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ’ (PLA) నిర్ధారించింది.ప్రోటోకాల్ ప్రకారం అతన్ని వెంటనే వెనక్కి పంపాలని కోరింది.
సోమవారం రోజు ఇండియన్ ఆర్మీ తాము ఈస్టర్న్ లడఖ్ లోని డెంచోక్ సెక్టార్ లో LAC దగ్గర ఒక చైనీస్ సైనికుడిని ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించింది.సైనికుడి బాగోగుల గురించి కూడా PLA నుండి భారత ఆర్మీ కి అభ్యర్ధన వచ్చింది.
వెస్ట్రన్ థియేటర్ కమాండ్ స్పోక్స్ పర్సన్ కల్నల్ జన్గ్ శుఇలి సోమవారం రోజు రాత్రి PLA సైనికుడు అక్టోబర్ 18 న సాయంత్రం అదృశ్యమయ్యాడాని ప్రకటించారు.ఘటన జరిగిన వెంటనే గార్డ్ లకు ఇండియన్ ఆర్మీ కి సమాచారం అందించాలని కోరామని ఆయన అన్నారు.
ఇండియన్ ఆర్మీ అతను దొరకగానే జాగ్రత్తగా వెనక్కి పంపుతామని ప్రమాణం చేసింది అని కూడా ఆయన పేర్కొన్నారు.నిజంగా సైనికుడు తప్పిపోయాడా లేక చైనా ఏదైనా కుట్ర పన్నిందా అని చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.