అత్యంత చవకగా ఇంటర్‌నెట్‌ సేవలు.. త్వరలో అందుబాటులోకి

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది.సిటీలు, పట్టణాల్లోనే కాదు.

 Cheapest Internet Services Coming Soon , Less Price , Internet Service , Technol-TeluguStop.com

గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.వైఫై సేవలు గ్రామాల్లోకి కూడా వచ్చేశాయి.

కరోనా, లాక్ డౌన్ కారణంగా కంపెనీలన్ని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.దీంతో తమ సొంతూళ్లకు వెళ్లి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.

దీంతో ఇంటర్నెట్ సంస్ధలు కూడా గ్రామాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి.చాలా కంపెనీలు గ్రామాలకు కూడా వైఫై సేవలు విస్తరించాయి.

అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందిస్తున్నాయి.

ఇక ఇండియాలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించేందుకు చాలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందులో భాగంగా తాజాగా అమెజాన్ కంపెనీ హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించేందుకు కసరత్తు చస్తోంది.అత్యంత తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు సిద్దమవుతోంది.ప్రాజెక్ట్ కైపవర్ అనే పేరుతో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించాలని నిర్ణయించింది.ఈ ప్రాజెక్ట్ కోసం బెంగళూరులో ఒక మేనేజర్ ను నియమించుకునేందుకు సిద్ధమైంది.

ఇక బిజినెస్ స్ట్రాటజీ లీడ్, కంట్రీ డెవపల్ మెంట్ ఉద్యోగులను నియమించుకోనుంది.

ప్రాజెక్ట్ కైపర్ అనేది ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహల సమూహన్ని ప్రారంభించేందుకు ఒక ఇనిషియేటివ్ అని, తక్కువ లేటెన్సీ, హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుందని కైపర్ కంట్రీ డెవపల్ మెంట్ టీమ్ చెబుతోంది.

అలాగే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ పేరుతో తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్ కంపెనీ ఇండియాలో దరఖాస్తులు పెట్టుకుంది

Telugu Cheapest, Satellite, Ups-Latest News - Telugu

ఈ ఏడాది ఏప్రిల్ లో సేవలు అందించాలని భావించింది.అయితే లైసెన్స్ తీసుకోకుండా సేవలను ప్రారంభించడంపై కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.అనుమతులు తీసుకోవాలని తెలిపింి.

దీంతో వచ్చే జనవరి నాటికి లైసెన్స్ తీసుకోవాలని స్సేస్ ఎక్స్ ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube