టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు బావ సుధీర్ బాబు( Sudheer Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న కానీ అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇక సుధీర్ బాబుకు ఇద్దరు కుమారులు అన్న విషయం కూడా మనకు తెలిసి ఇప్పటికే తన పెద్ద కుమారుడు చరిత్ మానస్ ( Charith Manas ) పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.అయితే అచ్చం తన మేనమామ పోలికలతో ఉంటారన్న విషయం కూడా మనకు తెలిసిందే .
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ( Gautham ) తన తాతయ్య కృష్ణ పోలికలతో ఉన్నారు కానీ మహేష్ బాబు పోలికలతో లేరు.కానీ మహేష్ బాబు అల్లుడు చరిత్ మానస్ మాత్రం అచ్చం తన మేనమామయ్య పోలికలతో ఉండటంతో జూనియర్ మహేష్( Junior Mahesh ) అంటూ ఈయనపై పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
మహేష్ బాబు తర్వాత అంత గ్లామరస్ హీరో ఎవరు ఉంటారో అని భావిస్తున్నటువంటి మహేష్ అభిమానులకు తన అల్లుడు చరిత్ మహేష్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తారు అంటూ సంబరపడుతున్నారు.
ఇకపోతే తాజాగా మానస్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.పార్క్ అవర్ ఫ్లో అంటూ పెద్ద ఎత్తున వర్కర్స్ చేస్తూ ఉన్నటువంటి ఈ వీడియోని చరిత్ మానస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు అల్లుడా మజాకా అచ్చం మహేష్ బాబుని గుర్తు చేస్తున్నారుగా అంటుకొందరు కామెంట్లు చేయగా మహేష్ బాబు తర్వాత అలాంటి సూపర్ స్టార్ మీరే ఒక సినిమా చెయ్యి తర్వాత మేము నీకు సూపర్ హిట్ లు అందిస్తాము అంటూ ఎంతో మంది మహేష్ బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన తదుపరి సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో తప్పనిసరిగా ఈయన సూట్ అవుతారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈయన వర్క్ అవుట్ లు చూస్తూ నెక్స్ట్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ హీరో మీరే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే సుధీర్ బాబు హీరోగా నటించినటువంటి కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి చరిత్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఇదివరకే తన తండ్రి సుధీర్ బాబు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేశారు.మరి చరిత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మామయ్యలా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.