తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న వాళ్లలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు నుంచే పాన్ డేస్ స్థాయి కి వెళ్ళాడు కాబట్టి ఈయన్ని తెలుగు సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి.
ఇక ఇలాంటి సమయంలో రాజమౌళి కెరియర్ మొదట్లో తీసిన సింహాద్రి సినిమా టైంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) ఒకాయన రాజమౌళి ని తీవ్రంగా విమర్శించారు.ఆయనకు సంబంధించిన ఒక షూట్ నడుస్తుంటే ఆ సీనియర్ ఆర్టిస్ట్ చాలా టేకులు తీసుకుంటున్నాడు ఆ సీనియర్ ఆర్టిస్ట్( Senior Artist ) చేసింది ఎంతసేపటికి రాజమౌళి ఓకే చేయకపోవడంతో ఆ ఆర్టిస్ట్ కోపం తో నీలాంటి డైరెక్టర్లను చాలామందిని చూశాను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర నేను పని చేశాను ఇప్పటివరకు ఒకటి రెండు టేకు ల్లోనే ఓకే అయ్యేది నువ్వు మాత్రం 20 టేకులు చేయించావు ఏంటి ఇది అని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజమౌళి ని సెట్ లో అందరి ముందు అన్నట్టుగా తెలుస్తుంది.
కానీ దానికి రాజమౌళి ఏమీ అనకుండా చిన్నగా నవ్వి ఇంకోటి చేయండి అని చెప్పి ఆయనతో చేయించుకొని టేక్ ఒకే చేయించుకున్నాడు.అలా రాజమౌళి ఎంతమంది విమర్శించిన కూడా తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ( Rajamouli Movies )ఎక్కడ కూడా తగ్గించుకోకుండా సినిమాలు చేస్తూ తన పర్ఫెక్షన్ ని చూపిస్తూ వస్తున్నాడు.అందులో భాగంగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో చేసే సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…
ఇక రాజమౌళి ని అలా తిట్టిన ఆర్టిస్ట్ ఎవరు అనేది బయటికి రానప్పటికి ఇక ఆ ఆర్టిస్ట్ ను రాజమౌళి తన సినిమాలో పెట్టుకోవడం మానేశాడు…
.