మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరారు.కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తనను పార్టీ అనాథను చేసిందని వాపోయారు.
ఎవరో తెలియని వ్యక్తులకు సీట్లు కట్టబెట్టారని మాజీమంత్రి సంభాని తెలిపారు.జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ తనను అనాథను చేయడంతో పాటు బలవంతంగా బయటకు పంపిందని చెప్పారు.అయితే బీఆర్ఎస్ తనను గౌరవంగా ఆహ్వానించిందని తెలిపారు.
ఈ క్రమంలో తనకు పదవులు అవసరం లేదన్న సంభాని నమ్మకంగా పని చేస్తానని స్పష్టం చేశారు.