టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఢిల్లీలో( Delhi ) రేపు సాయంత్రం జరగనున్న ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.
అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే.మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 136 స్థానాల్లో టీడీపీ లీడింగ్ లో ఉంది.అదేవిధంగా కూటమిలోని జనసేన 21 స్థానాలు, బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కాగా రాష్ట్రంలో కూటమి విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.