సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.ఒకే ఏడాదిలో కుటుంబంలో ముగ్గురు మరణించడంతో.
కృష్ణ మరణ వార్తపై చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తర్వాత సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరాదేవి మరణించడంతో ఆయన ఎంతగానో కృంగిపోయారు.
ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో నిన్న కార్డియాక్ అరెస్ట్ తో… కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయిన కృష్ణ ఈరోజు ఉదయం 4 గంటల తర్వాత తుది శ్వాస విడిచారు.

కృష్ణ మరణ వార్త పై ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు.ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో కృష్ణ మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.“తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది.నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు.కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది.ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన.ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”.అని పేర్కొన్నారు.