తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సుమ ప్రస్తుతం మకుటం లేని మహారాణిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా టాలీవుడ్లో టాప్ యాంకర్ లలో నెంబర్ వన్ యాంంకర్ గా కొనసాగుతోంది.ఏ షోలో చూసిన,ఈవెంట్ లో చూసినా, ఆడియో,ప్రే రిలీజ్ ఈవెంట్ లలో ఎక్కడ చూసినా కూడా సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది.
ఇకపోతే మొదటి సుమ సైడ్ క్యారెక్టర్స్ ను ప్రారంభించి మొదట సీరియల్స్ లో నటించి టాప్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంది.ఇకపోతే ఈమె టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇది ఇలా ఉంటే గతంలో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని, వారిద్దరు విడిపోయి వేరే ప్లాట్ లలో ఉంటున్నారని వార్తలు వినిపించాయి.
ఆ విషయం పై స్పందించిన రాజీవ్ కనకాల అందులో ఎటువంటి నిజం లేదు అని ఆ వార్తలను కొట్టి పడేసాడు.మా నాన్నగారి ప్లాట్ లో ఉంటే కూడా అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు అని నా భార్యను చూసి నేనెప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతాను అని వివరణ ఇచ్చడు రాజీవ్ కనకాల.
సుమ యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది.

కాగా సుమ కొడుకు రోషన్ ప్రస్తుతం హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా రాజీవ్ కనకాల పుట్టినరోజు కావడంతో ఇంట్లోనే స్పెషల్ గా కేక్ కట్ చేయించింది సుమ.అంతేకాకుండా గోదావరి తీరంలో కూడా వారిద్దరూ కలిసి ఆనందంగా తిరిగినట్లున్న ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది.ఇక ఆ వీడియోలో రాజీవ్ కనకాల సుమ ఇద్దరు కూడా టైటానిక్ లవర్స్ తరహాలో స్టిల్ ఇచ్చిన విధానం ఎంతగానో హైలెట్ అయింది.వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో మరోసారి ఈ వీడియో ద్వారా అర్థం అయింది.
అయితే ఇంత అందంగా ఉన్నా సుమ జంట గురించి అలాంటి వార్తలు వినిపించడం బాధాకరం అని చెప్పవచ్చు.







