టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా పోలీసుల పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అధికార పార్టీకి తొత్తులుగా మారి పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.ముఖ్యంగా జిల్లాలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, కొందరిని కావాలని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని.10 సంవత్సరాల వయసు కలిగిన వారిని కూడా పోలీసులు వేధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా వైసీపీ నేతల ఆదేశాలనుసారం గానే జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీని వీడే రీతిలో కార్యకర్తలపై ఒత్తిడి తీసుకువస్తున్నారని.ప్రకాశం జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కి చంద్రబాబు లెటర్ రాయడం జరిగింది.ముఖ్యంగా లింగసముద్రం ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుందని.పోలీసు ప్రతిష్టను కాపాడే రీతిలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.