విశాఖ తమ్ముళ్లకు దడపుట్టిస్తున్న జగన్ ? సూపర్ ట్విస్ట్ లు ?

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదట్లో ఆ పార్టీపై విమర్శలు చేసేందుకు తెలుగు తమ్ముళ్ళంతా భయపడేవారు.

ప్రభుత్వం తమను వేధింపులకు గురిచేస్తుందేమో అన్న భయంతో ఎవరికి వారు సైలెంట్ గా ఉండిపోతూ, టిడిపిలో ఉన్నామా లేదా అన్నట్లుగా ఉంటూ వచ్చేవారు.

కొంతమంది నాయకులు మాత్రం అదే పనిగా విమర్శలు చేస్తూ వచ్చేవారు.అటువంటి నేతలకు ప్రభుత్వం గట్టిగానే బహుమానం కూడా ఇచ్చింది.

వాళ్ళల్లో చాలా మంది నేతలు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.ఇక పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ వంటి వారు పెద్దగా రియాక్ట్ కాకపోవడం వంటి వ్యవహారాలతో అంత గప్ చిప్ అన్నట్టుగా పరిస్థితి ఉండేది.

ఇక ప్రభుత్వం సైతం తాము అనుకున్న నిర్ణయాలు అనుకున్నట్టుగా అమలు చేసి చూపించేది.అదేవిధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం చేయడమే కాకుండా, దానికి సంబంధించి పూర్తి కసరత్తు మొదలు పెట్టడంతో, అమరావతి పై టిడిపి ఉద్యమం మొదలుపెట్టి, జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించమని, ఉద్యమం మొదలు పెట్టింది.

Advertisement

అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడి వ్యవహారాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో, విశాఖ టీడీపీ నేతలు తమకు అమరావతి మాత్రమే కావాలని, మూడు రాజధానులు వద్దు అంటూ హడావుడి చేస్తున్నారు.ప్రభుత్వం విశాఖలో ఏ కార్యక్రమం మొదలుపెడదాం అన్నా, టిడిపి ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తూ అడ్డంకులు సృష్టిస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే వైసిపి విశాఖలో భూకబ్జాలు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి టీడీపీ నేతల అవినీతి వ్యవహారాన్ని బయట పెడుతూ వస్తోంది.ఇటీవలే అనకాపల్లి మాజీ ఎంపీ విశాఖ జిల్లా టిడిపి నాయకుడు సబ్బంహరి పార్క్ స్థలాన్ని ఆక్రమించి, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ కూల్చివేశారు.దీనిపై పెద్ద రాద్దాంతం జరిగింది.

అలాగే టిడిపి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రుషికొండ లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలను కూల్చి వేశారు .దీనిపైన పెద్ద దుమారమే రేగుతోంది.ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు టిడిపికి చెందిన బడా నాయకుల నుంచి చిన్నా చితకా నాయకుల వరకు అందరి వ్యాపార లావాదేవీల పైన కన్నేసిన ప్రభుత్వం అన్ని విషయాలపైన చర్యలకు దిగుతూ వస్తోంది.

దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు మిగతా నాయకులు ఎవరూ ముందుకు రారు అని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే లాజిక్ తో ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు