గత శుక్రవారం చంద్రబాబు( Chandrababu ) “ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి” పర్యటనలో పుంగునూరులో దాడులు జరగటం తెలిసిందే.పరిమిషన్ లేని రోడ్డులో చంద్రబాబు పర్యటిస్తున్నారని పోలీసుల అడ్డుకోవడం జరిగింది.
ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిని అడ్డుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి మొత్తం రణరంగంగా మారింది.ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మరింతగా ఉద్రిక్తతలకు దారీ తీయడంతో రాళ్ల దాడి జరగడంతో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
దీంతో చంద్రబాబు పుంగనూరు( Punganur ) పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే పుంగునూరు ఘటన విషయంలో దాదాపు 62 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగింది.
పుంగనూరు విధ్వంసం పట్ల పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.ఈ కేసులో పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ రామచంద్రారెడ్డిని( Ramachandra Reddy ) A1గా పేర్కొన్నారు.ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మందిని అరెస్టు చేసినట్లు వారిని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం.పుంగనూరు రాళ్ల దాడి ఘటనలో దాదాపు 40 మంది పోలీసులకు గాయాలయ్యాయి.