పన్ను కారణాల కోసం భారతదేశంలో విదేశీ పౌరులు (OCI) నివసించడం కామన్, వారిలో కొందరు విదేశాల డబ్బుతో భారత్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అనుకుంటారు.ముఖ్యంగా ఆస్తి( Property ) కుమారుడి పేరు మీద రిజిస్టర్ చేయొచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
అబ్బాయి కూడా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యుండి, భారతదేశం వెలుపల నివసిస్తుంటే అతడి పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చా? అనే ప్రశ్నకు తాజాగా నిపుణులు ఆన్సర్ చేశారు.

వారి ప్రకారం, తండ్రి డబ్బుతో కొడుకు పేరు మీద భారతదేశంలో( India ) ఆస్తిని కొనుగోలు చేయలేరు.ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (Fema) నిబంధనలే ఇందుకు కారణం.ఫెమా అనేది భారతదేశంలో విదేశీ మారకపు లావాదేవీలను నియంత్రించే చట్టం.
నిర్ణీత రోజుల పాటు దేశంలో నివసిస్తున్న వారినే భారతదేశ నివాసి( Indian Resident ) అని ఫెమా పరిగణిస్తుంది.దీని రూల్స్ ప్రకారం భారతదేశ నివాసిగా, సొంత పేరుతో లేదా మరొక భారతీయ నివాసి పేరుతో భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.
మరొక నివాసి కోసం ఆస్తిని కొనుగోలు చేయడానికి పవర్ ఆఫ్ అటార్నీని కూడా ఉపయోగించవచ్చు.ఇది బినామీ లావాదేవీ అవ్వదు.బినామీ లావాదేవీ అంటే డబ్బు నిజమైన మూలాన్ని చూపకుండా మరొకరికి ఆస్తిని కొనుగోలు చేయడం.

అయితే అబ్బాయి భారతదేశ నివాసి కాకుండా, అతను నాన్ రెసిడెంట్ ఇండియన్( NRI ) అయితే, నాన్ రెసిడెంట్ పేరుతో భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయడానికి తండ్రిని ఫెమా అనుమతించదు.ఇది ఫెమా నిబంధనల ఉల్లంఘన అవుతుంది.అయితే కొడుకుకి ప్రాపర్టీ అందించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి కొడుకుకు డబ్బును బహుమతిగా ఇవ్వవచ్చు.ఆ తర్వాత కొడుకు సొంత డబ్బులతో భారతదేశంలోని ఆస్తిని తన పేరు మీద కొనుగోలు చేయవచ్చు.
రెండు, భారతదేశంలోని ఆస్తిని సొంత పేరుతో కొనుగోలు చేయవచ్చు.అప్పుడు కొడుకుకు ఆస్తిని బహుమతిగా ఇవ్వవచ్చు.