తెలంగాణ ఎన్నికల ఫలితాలు పవన్ ను సంధిగ్డంలోకి నెట్టేశాయా ? తెలంగాణ ఎఫెక్ట్ జనసేనపై ఏపీలో కూడా ఉండనుందా ? ఇంతకీ తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ పవన్ కు లాభామా ? నష్టమా ? అనే ప్రశ్నలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి.జనసేన పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన కేవలం ఏపీపైనే ఫోకస్ చేస్తూ వచ్చారు పవన్ కల్యాణ్.
ఇక 2024లో అధికారమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.ఈ సందర్భంలో ఆయన అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల బరిలో దిగడం, అక్కడ ఊహించని విధంగా ప్రజలు తిరస్కరించడంతో పవన్ కు కొలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.
మొదట తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో సింగిల్ గానే బరిలోకి దిగాలని భావించిన జనసేనాని ఆ తరువాత అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకొని బీజేపీతో కలిసి ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు.అయితే జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకేలపోవడం గమనార్హం.
అన్నీ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితం అయ్యారు.ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే స్వతంత్ర అభ్యర్థులు జనసేన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించడం.దీంతో తెలంగాణలో జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఏపీ ఎన్నికల ముందు తెలంగాణలో జనసేనకు ఎదురైన ఈ పరాభవం ఆ పార్టీని తీవ్రంగా బాధించే అంశమే.
ఏపీలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది.పార్టీ అధినేత పవన్ కూడా రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి.దాంతో ప్రజలు పవన్ ను సీరియస్ పొలిటీషియన్ గా గుర్తించలేదనే వాదన బలపడుతూ వచ్చింది.ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.ఈ ప్రభావం జనసేన పార్టీకి రాబోయే ఏపీ ఎన్నికల్లో ఎంతో కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉందని రాజకీయవాదులు చెబుతున్నారు.ఈ స్థాయిలో జనసేన పార్టీ విఫలం కావడం వెనుక పవన్ అనుసరించే వ్యూహలే అనేది చాలమంది అభిప్రాయం.
ఆయన అస్థిర నిర్ణయాలే పార్టీని దెబ్బ తీస్తున్నాయని.పవన్ తీరు మార్చుకోకపోతే రాజకీయాల్లో ఆయన కథ ముగియడం గ్యారెంటీ అనేది కొందరి అతివాదులు చెబుతున్నా మాట.మరి రాబోయే ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.