ఓ ప్రముఖ వ్యాపారవేత్త.ఆయన సోషల్ మీడియాలో వచ్చే జోకులు తనదైన స్టైల్ లో పంచ్ లను జోడిస్తూ అందరినీ నవ్విస్తుంటారు.
అదేంటి వ్యాపారవేత్త అంటే వ్యాపార విషయంలో.దానికి సంబంధించిన పెట్టుబడి విషయంలో తీరిక లేకుండా బిజీ గా ఉండాలి కదా.మరి ఈయన ఏంటి సోషల్ మీడియాలో వచ్చే జోకులకు కౌంటర్లు వేస్తారని అంటున్నారు.అవునండి మీరు విన్నది నిజమే ఆయన ఎవరో కాదు పేరుగాంచిన వ్యాపారవేత్త “ఆనంద్ మహీంద్రా”.
ఈయన సోషల్ మీడియాలో వచ్చే పంచ్ లకు.ఆసక్తికరమైన మాటలను జోడిస్తుంటాడు.
అంతేకాకుండా జీవిత పాఠాల గురించి తెలుపుతూ ఎలా ఉండాలో నేర్పుతారు.ఈయనకు సోషల్ మీడియాలో 8.3 మిలియన్ల మంది ఫాలోవర్ లు ఉన్నారు.
ఆయనకు అంతమంది ఫాలోయింగ్ ఉండటానికి కారణం వెనుక ఆయన అందిస్తున్న ట్వీట్ లకే.అయితే ఓ వీడియోలో ఓ పెద్దాయన రోజు బరువులు ఎత్తుతూ ఇబ్బందులు పడతాడు.కానీ ఆయన అలా చేయడానికి కారణం క్రిస్మస్ రోజున తెలుస్తుంది.
తన మనుమరాలికి క్రిస్మస్ ట్రీ పై ఉన్న స్టార్ ను ఆమె చేతులతోనే అందుకోవడానికి తనని ఎత్తుకున్నాడన్న విషయం అర్థమవుతుంది.ఈ వీడియో కి సంబంధించిన విషయం పై ఆనంద్ మహీంద్రా కంటతడి పెట్టినట్లు సోషల్ మీడియాలో తెలిపారు.
దీని గురించి ఆయన వీడియోలు తెలుపగా అది వైరల్ కావడంతో దానిని వీక్షించిన జనాలు కూడా కంటతడి పెట్టినట్లు తెలిపారు.కాగా ఇటీవలే ఫేస్ బుక్ లో ఓ పోస్టు రాగా దానికి తెగ నవ్వానంటూ తెలిపారు.కదా పోస్ట్ ఏంటంటే.ఒంటరి చీమ 29 ఏళ్లు బతుకుతుంది అని ఓ వ్యక్తి పోస్ట్ చేయగా.దానికి మరో వ్యక్తి పెళ్లయిన చీమ పరిస్థితి ఏంటి భయ్యా అని కామెంట్ విసిరాడు.దీనికి ఆయన చాలా నవ్వుకున్నాను అని తెలుపుతూ.
కామెంట్ కి సంబంధించిన పోస్ట్ ను షేర్ చేశారు.
అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న సమయంలో జీవిత సత్యాలకు సంబంధించిన విషయాలను తెలుపుతూంటూ.
అందులో ఒకటి.ఆనందం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న ఉండగా దానికి అది ఎవరో ఇచ్చేది కాదు మనమే సొంతంగా పొందాలని కార్టూన్ ద్వారా చూపారు.
ఇలా జీవితం లకు సంబంధించిన విషయాల గురించి, కొన్ని పోస్ట్ ల గురించి ప్రపంచానికి తెలుపుతూ అందరిని తన మాటలతో సంతృప్తిపరుస్తారు.