తన సర్వీసులో 1 రోజు కూడా సెలవు పెట్టని ఉద్యోగి.. 62 లక్షలు బహూకరణ!

ఒక ప్రైవేట్ ఉద్యోగికి సెలవు అనేది నేడు అందని ద్రాక్ష మాదిరి తయారయ్యిందనే విషయం అందరికీ తెలిసినదే.అవసరమైనపుడు ఎన్నో ప్రయాసలు కోర్చి బతిమిలాడితే గాని ఒకరోజు సెలవు లభించదు.

 Burger King Employee Gets Huge Donation Of 62 Lakhs For Not Taking A Single Leav-TeluguStop.com

ఒకవేళ తమ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా సెలవు పెట్టినట్టైతే మాత్రం ఇక వారి ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు.నెక్స్ట్ డే సదరు ఉద్యోగికి ఓ టెర్మినేషన్ లెటర్ ని కొరియర్లో ఇంటికి పంపిస్తారు.

అందువలనే ఏ ప్రైవేట్ ఉద్యోగికైనా తన ఉద్యోగ జీవితం అంత ఆశాజనకంగా ఉండదు.సెలవులు కావలసిన ఉద్యోగులు.

ఎక్కువశాతం తమ బాస్‌కు వివిధ అబద్ధాలు చెప్పి, ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు.

ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఉద్యోగి మాత్రం ఉద్యోగులలో నేను వేరయా! అన్నమాదిరిగా వ్యవహరిస్తున్నారు.అవును… అతనికి ఉద్యోగం చేస్తున్నంతకాలం ఒక్క సెలవు కూడా అవసరం రాలేదట.దాంతో తాను ఉద్యోగం చేసినన్ని రోజులు ఒక్క సెలవు కూడా పెట్టనేలేదట.

అందువలన ఓ భారీ నజరానాతో అతగాడికి సత్కారం లభించింది.వివరాల్లోకి వెళితే.

అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న ‘కెవిన్ ఫోర్డ్’ వయస్సు 60 ఏళ్ళు.కెవిన్ గత 27 సంవత్సరాల్లో ఒక్కంటంటే ఒక్క సెలవు కూడా పెట్టకుండా పనిచేయడం సదరు సంస్థకు విస్మయాన్ని కలిగించింది.

Telugu Lakhs, America, Burger Employee, Kevin Ford, Leave, Day, Rewards Latest-L

అంతేకాకుండా, కెవిన్ తన ఉద్యోగ ధర్మాన్ని తూచ పాటించేవాడట.కస్టమస్టర్లకు సర్వీసులో ఏ లేపమూ లేకుండా చూసుకునేవాడట.దాంతో అతని అంకింతభావానికి కస్టమర్లు ఫిదా అయ్యి, అతనికేదైనా సాయం చేయాలని “గోఫండ్‌మి” వేదికపై విరాళాలు సేకరిస్తున్నారు.దాంతో ఇప్పటివరకు అతనికి రూ.62 లక్షల రూపాయలు లభించాయి.ఇక తన అంతికభావాన్ని గుర్తించిన బర్గర్ సంస్థ సినిమా టికెట్లు, పెన్నులు, మంచి బ్యాగు ఇచ్చిందటూ కెవిన్ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అతని గురించి తొలిసారి బయటకి తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube