పుష్ప పార్ట్ 2 లో అలాంటి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ కు సూచన చేసిన బన్నీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా వైకుంఠపురం లో సినిమా తర్వాత బన్నీ నటించిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప.

 Bunny Suggested To Director For Pushpa Part 2 Scenes Preferences Details, Pushp-TeluguStop.com

ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన మూడవ సినిమా ఇది.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 , పుష్ప సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించాయి.మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని అందించడం గమనార్హం.

పుష్ప సినిమాలో  అల్లు అర్జున్ యాక్టింగ్, మాస్ లుక్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి.దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయానికి దోహదపడింది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ స్థాయి ని అమాంతం పెంచేసింది.పుష్ప సినిమాలోని డైలాగులు, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అందువల్ల పుష్ప టు సినిమా విషయంలో కూడా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

Telugu Allu Arjun, Devisri Prasad, Sukumar, Pushpa, Pushpa Rule, Tollywood-Movie

పుష్ప సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.పుష్ప పార్ట్ వన్ సినిమా లో యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పార్ట్ 2 లో కూడా కొన్ని అద్భుతమైన యాక్షన్ సీన్లు ఉండేలా చూడాలని బన్నీ సుకుమార్ కు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.అందువల్ల సుకుమార్ మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ లు, డాన్స్ కొరియోగ్రాఫర్ ల కోసం వేట మొదలు పెట్టారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube