బుమ్రాకు కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది..!

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బుమ్రాను పెళ్లి చేసుకోబోతుందని వారం రోజులుగా ప్రచారం ఊపందుకోవడం జరిగింది.అయితే ఈ వార్తలను అనుపమ పరమేశ్వరన్ కుటుంబ సభ్యులు ఖండించారు.

 Bumrah Will Be Marrying Sanjana Ganesan, Jasprit Bumrah, Team India, Sanjana Gan-TeluguStop.com

దీంతో ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.

బుమ్రా పెళ్లి చేసుకోబోయేది అనుపమ పరమేశ్వరన్ ను కాదని.అతడు పెళ్లి చేసుకోబోయే వార్త నిజమే కానీ.

అనుపమకు మాత్రం కాదని తాజాగా తేలిపోయింది.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్టు నుండి జస్ప్రీత్ బుమ్రా అనూహ్యంగా వైదొలిగాడు.

అతడు తన పెళ్లి కోసమే ఈ టెస్టు నుండి తప్పుకుని సెలవలు పెట్టి ఇంటికి వెళ్ళాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు నిజమే.బుమ్రా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.మార్చి 14, 15 గోవాలో బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

బుమ్రా పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.28 సంవత్సరాల ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.సంజనా ఐపిఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అంతేకాదు ఈ అమ్మడు పలు సందర్భాల్లో బుమ్రాను ఇంటర్వ్యూ కూడా చేసింది.వీరి ప్రేమ ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కానీ.మొత్తానికి పెళ్లి చేసుకునే వరకు వస్తే కానీ తెలియలేదు.

అంత గోప్యంగా ఉంచారు.

Telugu Jasprit Bumrah, Sanjana Ganesan, India-Sports News క్రీడలు

భుమారా సంజనా గోవాలో మార్చి 14 న వివాహం చేసుకోబోతున్నారు.వీరి వివాహానికి అతి కొద్దీ మందిని మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.బుమ్రా కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరవుతారని తెలుస్తుంది.

అయితే పెళ్లి తర్వాత రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకోబోతున్నారట.బుమ్రాను పెళ్లి చేసుకోబోతుందని తెలిసి ఈమె ఎవరు.

ఎం చేస్తుందని.నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube