Boney Kapoor: సహజ మరణం కాదు అంటూ శ్రీదేవి మరణం పై ఇన్నాళ్ళకు అసలు విషయం బయటపెట్టిన బోనికపూర్..!!

అందాల తార శ్రీదేవి ( Sridevi ) చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి ఆమె మరణం పై చాలా మంది ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమెను హత్య చేశారంటూ ఎన్నో అనుమానాలు ఆమె చనిపోయిన సమయంలో తెరమీద వినిపించాయి.

 Boney Kapoor Revealed The Truth About Sridevis Death-TeluguStop.com

అయితే తాజాగా ఈ విషయాలన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చారు బోని కపూర్( Boney Kapoor ) .శ్రీదేవి మరణానికి గల అసలు కారణాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెడుతూ.అసలు నా భార్య శ్రీదేవిది సహజ మరణం అస్సలు కాదు.ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగిపోయి చనిపోయింది.ఇక దానికి కూడా ఒక కారణం ఉంది.

Telugu Boney Kapoor, Dubai, Jahnvi Kapoor, Khushi Kapoor, Nagarjuna, Sridevi, Sr

ఆమె ప్రతిరోజు ఉప్పు లేకుండానే అన్నం తినేది.కానీ డాక్టర్లు నీకు లో బీపి ఉంది ఉప్పు లేకుండా ఫుడ్ అస్సలు ముట్టుకోకూడదు అని చెప్పినా కూడా డాక్టర్ల మాటలు కేర్ చేయకుండా ఎప్పుడైనా సరే అందరికీ అందంగా కనిపించడం కోసం అలా ఉప్పు లేకుండా తినేది.అలాగే ఉన్నన్ని రోజులు సన్నగా నాజుగ్గా కనిపించడం కోసం డైట్ పాటించేది.

ఈ విషయంలో ఎన్ని సార్లు చెప్పినా కూడా అస్సలు వినేది కాదు.

Telugu Boney Kapoor, Dubai, Jahnvi Kapoor, Khushi Kapoor, Nagarjuna, Sridevi, Sr

ఇక ఓ రెండు మూడు సార్లు లో బీపి వచ్చి నీరసంగా పడిపోయింది కూడా.అయితే మేం పెళ్లికి వెళ్లిన సమయంలో కూడా లోబీపీ కారణంగా శ్రీదేవి ( Sridevi ) బాత్రూంలో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి చనిపోయింది.ఇక శ్రీదేవి చనిపోయిన సమయంలో ఇండియా నుండి ఒత్తిడి రావడంతో పోలీసులు నన్ను దాదాపు 24 గంటలు విచారించారు.

అలాగే నా మీద అనుమానంతో లై డిటెక్టర్ ఇంకా ఎన్నో రకాలుగా ప్రశ్నలు కూడా అడిగారు.ఇక శ్రీదేవి చనిపోయాక కొన్ని రోజులకి నాగార్జున ( Nagarjuna ) మా ఇంటికి వచ్చి శ్రీదేవి ఓసారి సినిమా షూటింగ్లో కూడా ఇలాగే లోబీపీతో కళ్ళు తిరిగి పడిపోయింది.

ఆరోజు ఆమె పన్ను కూడా విరిగిపోయింది అంటూ నాతో చెప్పారు అని బోని కపూర్ ఎట్టకేలకు శ్రీదేవి మరణం పై ఉన్న అనుమానాన్ని తొలగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube