బాలీవుడ్ స్టార్స్ కు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అవుతుందా..!

సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ నేర్చుకోవాలంటూ ఎప్పటి నుండో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ మధ్య సౌత్ సినిమాలు హిట్ అయినంత రేంజ్ లో బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి.

 Bollywood Stars Enlightened For Years, Salmankhan,bollywood, Bollywood Stars, Bo-TeluguStop.com

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి ద్రుష్టి సౌత్ మీద పడింది.

అప్పటి నుండి సౌత్ హీరోలు కూడా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

మన టాలీవుడ్ లో ఇప్పుడు అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలపైన ద్రుష్టి పెట్టారు.

భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.అయితే బాలీవుడ్ ఇందుకు విరుద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

అక్కడి హీరోలందరూ మినిమమ్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు.కానీ రెమ్యునరేషన్ మాత్రం కోట్లకు కోట్లకు తీసుకుంటూ సినిమాలు మాత్రం నామమాత్రంగా తీస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ప్రేక్షకులు స్టార్ హీరోలపై మండి పడుతున్నారు.

Telugu Bollywood, Bollywoodfans, Bollywood Stars, Budget, Salmankhan, Tollywoodp

సల్మాన్ ఖాన్ లాంటి హీరో సినిమాకు వందల కోట్లు వసూలు చేస్తూ సినిమా మేకింగ్ కు మాత్రం 50 నుండి 60 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేలా చేస్తూ సినిమాలో నిర్మాణ విలువలు లేకుండానే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.ఎలా ఉన్న సల్మాన్ సినిమా అయితే హిట్ అవుతుందని నిర్మాతలు కూడా సినిమా బడ్జెట్ పై ద్రుష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

సల్మాన్ మాత్రమే కాదు మిగతా బాలీవుడ్ హీరోలు కూడా రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది.

మేకింగ్ కు మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు.

Telugu Bollywood, Bollywoodfans, Bollywood Stars, Budget, Salmankhan, Tollywoodp

సౌత్ లోనే వందల కోట్లు పెట్టి తీస్తుంటే.బాలీవుడ్ హీరోలు మాత్రం చిన్న చితక బడ్జెట్ తో సినిమాలు చేస్తూ నిరాశ పరుస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ హీరోలు కూడా ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ 300 కోట్లతో సినిమా చేయబోతున్నట్టు టాక్.రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గి అయినా భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు సన్నద్ధం అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ హీరోలు నేర్చుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube