వెబ్ సీరీస్ కి సిద్దమవుతున్న స్టార్ హీరో...

బాలీవుడ్ లో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ, వినూత్న కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరిచేటువంటి స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి తెలియనివారుండరు.ఇటీవల కాలంలో త్రీ ఇడియట్స్, ధూమ్ 3, పీకే, తగ్స్ ఆఫ్ హిందుస్థాన్, దంగల్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను  మెప్పించాడు అమీర్ ఖాన్.

 Bollywood Star Hero Amir Khan Getting Ready To The Web Series-TeluguStop.com

అయితే తాజాగా అమీర్ ఖాన్ వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు సమాచారం.అయితే ఇందుకుగాను చిత్ర పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉంటున్నటువంటి ఓ దర్శకుడు కూడా తన కథతో అమీర్ ఖాన్ ని సంప్రదించాడట.

కథ నచ్చడంతో అమీర్ ఖాన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అయినటువంటి షారుక్ ఖాన్, సైఫ్ అలీఖాన్ కూడా సిరి స్ లో నటిస్తున్నారు.ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

దీంతో అమీర్ ఖాన్ కూడా ఇదే బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Amir Khan, Amir Khan Web-Movie

అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అద్వైత చందన దర్శకత్వం వహిస్తున్న టువంటి “లాల్ సింగ్ చడ్డా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటిస్తుండగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube