బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది.ఆమె తాత్కాలిక బెయిల్ ను న్యాయస్థానం వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించింది.
తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్న జాక్వెలిన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యారు.ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం.
రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారిస్తామని తెలిపింది.అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.అయితే, సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి జాక్వెలిన్ రూ.7 కోట్ల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకున్నారనే కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.