బాలయ్య సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో సమరసింహారెడ్డి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా గురించి, ఇతర సినిమాల గురించి సి.
కళ్యాణ్ ఆసక్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సి.కళ్యాణ్ మాట్లాడుతూ వర్మతో టైమ్ పాస్ బాగుంటుందని అన్నారు.వర్మ మద్యం తాగినా తాగకపోయినా ఒకేలా ఉంటారని ఆయన తెలిపారు.
వర్మ సినిమా గురించే మాట్లాడతరని ఆయన కామెంట్లు చేశారు.
కొన్ని వందల సినిమాల సెటిల్మెంట్లు చేశానని ఆయన అన్నారు.
సమరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన పంచాయితీ నేనే చేశానని ఆయన కామెంట్లు చేశారు.పలనాటి బ్రహ్మనాయుడు పంచాయితీ నేనే చేశానని ఆయన వెల్లడించారు.
అంజి సినిమాకు సంబంధించిన పంచాయితీ నేనే చేశానని ఆయన చెప్పుకొచ్చారు.నా కారు కనిపిస్తే సినిమా సమస్య పరిష్కారం అవుతుందని చాలామందిలో నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆ సినిమాల సెటిల్ మెంట్లు తప్ప మరే సెటిల్ మెంట్లు నేను చేయలేదని ఆయన కామెంట్లు చేశారు.
చిత్రపురి ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు.చిత్రపురి కాలనీకి నేను మేలు చేశానని ఆయన కామెంట్లు చేశారు.చిత్రపురి కాలనీలో సింగిల్ ఫ్లాట్ కూడా నేను తీసుకోలేదని ఆయన వెల్లడించారు.
చిత్రపురి కాలనీలో జరిగిన మోసాల గురించి ఆధారాలు ఉన్నాయని సి.కళ్యాణ్ కామెంట్లు చేశారు.
సి.కళ్యాణ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.బాలయ్యతో సి.కళ్యాణ్ ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్నారు.ఆ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. సి.కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చిరంజీవి, బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.