బిగ్ బీ అమితాబచ్చన్ హోస్ట్ గా హిందీలో ప్రసారం అవుతోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.ఈ షో ద్వారా బిగ్ బీ ఎంతో మందికి మరింత దగ్గరయ్యారు.
ఈ షోకి లక్షల్లో అభిమానులు ఉన్నారు.కొంత మంది ఈ షోలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ నడుస్తోంది.ఎంతగానో అవకాశం కోసం ఎదురుచూసిన హిమనీ బుందేలాకి ఈ సీజన్ లో అవకాశం వచ్చింది.
అయితే ఈ అవకాశాన్ని హిమనీ బుందేలా వంద శాతం ఉపయోగించుకున్నారు.ఈ షోలో పాల్గొని కోటీ రూపాయలు గెలిచుకున్నారు.
అయితే ఈ సీసన్ లో కోటి గెలుచుకున్న మొదటి విజేత కూడా హిమనీ బుందేలా కావడం విశేషం.అయితే ఈ యువతీ కోటి గెలవడం గురించి మాట్లాడడం పక్కన పెడితే ఈ యువతి కథ ఎంతగానో స్ఫూర్తినిస్తోంది.
ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల బుందేలా ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్ ఆమెను ఢీకొట్టింది.ఈ ప్రమాదం ఆమె జీవితాన్నే మార్చేసింది.ఈ ప్రమాదంలో ఆమెకు చూపు తగ్గింది.అన్ని సార్లు ఆపరేషన్ చేసిన చూపు మాత్రం రాలేదు.
అలా దృష్టిలోపంతోనే ఈ సీసన్ వరకు వచ్చి కోటి రూపాయలు గెలవడం విశేషం.ఆమె ఇక్కడ గెలవడమే కాదు ఎందరో మనసులను గెలుచుకుంది.
అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది.

మనిషి మేధస్సు ముందు మనిషిలోని లోపం ఎప్పటికి అడ్డుకాదు అని హిమనీ బుందేలా గెలుపు మరోసారి రుజువు చేసింది.ఇప్పటి వరకూ జరిగిన అన్ని సీజన్ లలో కోటి రూపాయలు గెలిచిన తొలి అంధ విజేత హిమానీ బుందేలానే.అయితే ఈ గెలుపు ఆమెకి ఊరికే రాలేదు.
చూపు లేదని ఎప్పుడు బాధపడలేదు.జీవితాన్ని అక్కడే ఆపేయకూడదని భయపడుతూనే ముందడుగు వేసింది.
పిల్లలకు ట్యూషన్లు చెప్తూ మేధస్సును పెంచుకోసాగింది.