తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ( BJP ) ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది.అధికారమే లక్ష్యంగా ఉన్న కమలం పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటి ? అసలు పొత్తుల విషయంలో ఆ పార్టీ వైకరి ఏంటి ? ఇక కొన్ని ప్రశ్నలు కాషాయ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి.రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్నికల హీట్ మొదలైపోయింది.అధికార బిఆర్‌ఎస్ తో కాంగ్రెస్ కూడా తెగ హడావిడి చేస్తోంది.కానీ బీజేపీ మాత్రం ఇంకా స్లో అండ్ స్టడీ విధానన్నే అనుసరిస్తోంది.ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇప్పటివరకు అభ్యర్థుల ప్రకటన జరగలేదు.
త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెబుతున్నప్పటికి ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

అటు పొత్తులపై ఆ పార్టీ గందరగోళానికి లోనవుతూ వస్తోంది.ఎందుకంటే ఏపీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణ బరిలో కూడా దిగబోతున్నట్లు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )ఇటీవల స్పష్టం చేశారు.అయితే బీజేపీతో కలిసే అవకాశం ఉందా అనే దానిపై మాత్రం సమాధానమివ్వలేదు.
ఇటు బీజేపీ నేతలు కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనే దానిపై లెక్కలు వేస్తున్నారు.ఒకవేళ ఎలాంటి పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే బిఆర్‌ఎస్, బీజేపీ పార్టీలతో పాటు జనసేనను ప్రత్యర్థిగా భావించాల్సి ఉంటుంది.
ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతో కొంత చూపే అవకాశం ఉంది.ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉంది.దీంతో పొత్తు విషయంలో బీజేపీ కన్ఫ్యూజన్ ల్లో పడింది.అయితే అంతర్గత సమావేశాల అనంతరం బీజేపీ ఒంటరిగానే దిగబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకొదని ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ సునీల్ దియోధర్( Sunil Deodhar ) ఇటీవల స్పష్టం చేశారు.అయితే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడానికి కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే బిఆర్‌ఎస్ మరియు మజ్లిస్ పార్టీలు పొత్తులో ఉన్నాయి.అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది.దీంతో ఆయా పార్టీల వ్యతిరేక ఓటు బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనేది కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది.పైగా జనసేన, టిడిపి వంటి పార్టీలు తెలంగాణలో ఎంతమేర ప్రభావం చూపుతాయో గ్యారెంటీ లేదు.
దాంతో ఒంటరిగా బరిలోకి దిగడమే బెటర్ అని బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది.మరి బీజేపీ ఒంటరిపోరు కలిసొస్తుందో లేదో చూడాలి.