వీళ్లేం వైద్యులురా బాబు.. చెవి నొప్పికి వెళ్తే ఏకంగా..?!

ఇప్పటి రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా మంది భయపడుతున్నారు.ఎందుకంటే జరిగే సంఘటనలు అంత దారుణంగా ఉన్నాయి.

 Bihar Woman Went For Ear Operation Hand Cut Off Details, Docters, Negligence, Ea-TeluguStop.com

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలో గర్భనిరోధక ఆపరేషన్ చేసుకున్న చాలా మంది అస్వస్థతకు గురికాగా, ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.

తాజాగా బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

బీహార్‌లో ఒ అమ్మాయి పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళకు జీవితాతం కష్టాలు తీసుకొచ్చింది.రెండు, మూడు నెలల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆమె జీవితాన్నే ప్రశార్థకంగా మార్చింది.

ఇంతకీ ఏం జరిగిందటే.?

బిహార్‌ లోని శివనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి విపరీతమైన చెవునొప్పి లేసింది.దీంతో ఆమె ఆసుపత్రిల చుట్టూ తిరగగా, మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రికి వెళ్లిన యువతికి, డాక్టర్లు పరిశీలించి చెవికి ఆపరేషన్ చేశారు.ఇక రెండు మూడు రోజులు బాగున్న అమ్మాయికి, తన ఎడమ చేయి కలర్ చేంజ్ అవ్వడం మొదలైంది.

దీంతో తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాగా, డాక్టర్లు చెప్పిన విషయం విని ఒక్కసారిగా వారు షాకై , బోరున విలిపించారు.ఇన్ఫెక్షన్ కారణంగా చేయి డ్యామేజ్ కావడంతో అది తీసేయాలని చెప్పారు.

ఇక చేసేది ఏమీ లేక ఆపరేషన్ చేసి తన చేయి తీసేశారు.పాపం రెండు నెల్లలో జరగాల్సిన పెళ్లి కూడా వాయిదా పడింది.

Telugu Bihar, Docters, Ear, Ear Pain, Hand, Negligence, Latest-Latest News - Tel

ఆపరేషన్ చేసే సమయంలో ఇంజెక్షన్ వికటించి ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు వైద్యులు.దీంతో షాకైన యువతి చెవునొప్పి కోసం అని వెళ్తే చేయి తీసేయేడంతో, బోరున విలపించింది.ఆ అమ్మాయిని చూసి వారెవరూ ఆమె కన్నీళ్లను ఆపకోలేక పోయారు.ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారు యువతి పట్ల సానుభూతి తెలుపుతున్నారు.

ఈ ఘటనపై అమ్మాయి తరఫున వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న వారు ఆసుపత్రి నర్స్, వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరికంటా కన్నీరు తెప్పిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube