స్మగ్లింగ్ కోసం బొలేరో.. కంపెనీనే షాక్..!

టెక్నాలజీ ఎంత మారుతుందో మనుషుల తెలివి తేటలు కూడా అంతకు అంతకు పెరిగిపోతున్నాయి.‘ వేలు చూపుతే కొండ పాకాలి’ అన్న పెద్దల నానుడి ఇప్పుడు కొందరు అమలు చేస్తున్నారు.తమ తెలివికి పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు సైతం అవాక్కు అవుతున్నాయి.చేసే పని ఎలాంటిదైనా సరే నలుగురు గుర్తు పెట్టుకోవాలనుకున్నారో ఏమో ఈ దొంగలు, చేసిన పని నలుగురు కాదు ఏకంగా రాష్ట్ర ప్రజలనే అవాక్కు చేసింది.

 Smuggling Alcohol On Bolero Roof In Bihar Viral Details, Smuggling, Bolero, Tech-TeluguStop.com

ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా?

ఎక్కడైనా సరుకు రవాణా చేయాలంటే ముందుగా గుర్తు వచ్చే పేరు మహీంద్రా బొలేరో వాహనం.సరుకే కాదు, ఎక్కడైనా జాతరలకు వెళ్లాలన్నా, శుభకార్యాలకైనా చాలా కమ్ఫర్ట్‌గా ఉంటుంది.

కానీ, చాలా మంది సరుకు రవాణ కోసం బొలేరో వాహనాన్నే వినియోగిస్తుంటారు.

కానీ కొందరు వ్యక్తులు తమ మెదడుకు పదును పెట్టి, కొత్తగా ఆలోచించారు.

ఏకంగా స్మగ్లింగ్ కోసమే బొలేరో వాహనాన్ని ఉపయోగించారు.తాజాగా బీహార్‌లో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Telugu Bihar, Bolero, Alcoholbolero, Ups, Latest-Latest News - Telugu

కొందరు వ్యక్తులందరూ కలిసి బొలేరో వాహనం టాప్‌ను కాస్త మార్చి మద్యం బాటిళ్లను స్మగ్లింగ్ చేస్తున్నారు.ఇక అది చూస్తే ఎవరికీ కొంచెం కూడా అనుమానం రాదు.అలా దాన్ని మార్చేశారు.కానీ వీరికన్న పోలీసులు ఇంకాస్త తెలవిగల వారు కదా పాపం పట్టేసుకున్నారు.బొలేరో వాహనాన్ని తీసుకొని వెళ్తున్న క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని చాలా వెతికారు.చివరకు డౌట్ వచ్చి పై కప్పు చూడగా అసలు విషయం తెలిసింది.

అందులో మద్యం బాటిల్స్ దర్శనం ఇచ్చాయి.దీంతో షాకైన పోలీసులు.

స్మగ్లర్‌ల నైఫుణ్యానికి సైతం ఫిదా అయ్యారు.అనంతరం వారందరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube