ఎంత ఖర్చు పెట్టైనా సరే లావు తగ్గాలనుకున్నా.. సీక్రెట్ రివీల్ చేసిన బిగ్ బాస్ విన్నర్?

సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్ లు ఎక్కువగా బాడీ షేమింగ్ విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే కేవలం లావుగా ఉన్నవారు మాత్రమే కాకుండా, పలుచగా ఉన్న వారు కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొంటూ ఉంటారు.

 Bigg Boss Winner Tejasswi Prakash Spokes About Body Shaming Bigg Boss , Tejaswi-TeluguStop.com

అయితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి ప్రకాష్ కూడా ఈ బాడీ షేమింగ్ విషయంలో స్పందించింది.హిందీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 15 లో కంటెస్టెంట్ గా పాల్గొని విన్నర్ గా నిలిచింది తేజస్వి ప్రకాష్.

బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది తేజస్వి ప్రకాష్.

బరువు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే బాడీ షేమింగ్ కు గురవుతారని అందరూ భావిస్తారు కాని పలుచగా సన్నగా ఉన్నవారు కూడా బాడీ షేమింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వెల్లడించింది తేజస్వి ప్రకాష్.

ఇక తన కెరీర్ ప్రారంభం సమయంలో ఆమె స్లిమ్ గా బక్క పలుచగా ఉండడంతో ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించించేదట.ఇక చాలామంది వారి శరీరం ఫై డబ్బులు వెచ్చిస్తుండడంతో ఆమె కూడా డబ్బులు ఖర్చు చేసి సన్నగా మారాలని అనుకుందట.

కానీ ఇతరులు చేసే కామెంట్స్ కి తాను మారకూడదు, రియాక్ట్ అవకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలిసింది తేజస్వి ప్రకాశ్.

Telugu Bigg Boss, Biggboss, Nagini, Secreat Revel, Tejaswi Prakash-Movie

ఆమె ఒక యాడ్ చేయగా, ఆ యాడ్ లో నటించినందుకు గాను హీరో కంటే ఆమెకే అధికంగా పారితోషికం ఇచ్చినట్లు తెలిపింది.జాబ్ లో పుణ్యాన్ని బట్టే మీకు డబ్బులు చెల్లిస్తారు అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాష్.ఇక తేజస్వి ప్రకాష్ ప్రస్తుతం చరణ్ తో డేటింగ్ లో ఉంది.

బిగ్ బాస్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త వీరిద్దరి డేటింగ్ వరకు వెళ్ళింది.

ఇకపోతే తేజస్వి ప్రకాష్ ప్రస్తుతం హిందీ లో ప్రసారం అవుతున్న నాగిని 6 సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube