ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ అప్పుడే 12 వారాలు పూర్తి చేసుకొని 13 వ వారం లోకి అడుగుపెట్టింది.గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా అశ్విని( Ashwini ) మరియు రతికా( Rathika ) ఎలిమినేట్ అయిపోయారు.
ఈ వారం కెప్టెన్ ఎవ్వరూ లేరు కాబట్టి అమర్ దీప్( Amardeep ) తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు.అమర్ దీప్ మీద గత వారం పెద్దగా ఎవరికీ పాయింట్స్ లేవు కాబట్టి ఎవరూ నామినేట్ చెయ్యలేదు.
అయితే ప్రస్తుతం హౌస్ లో మిగిలింది కేవలం 8 మంది మాత్రమే.వీరిలో అమర్ బ్యాచ్ మరియు శివాజీ బ్యాచ్ లో ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు.
కాబట్టి నామినేషన్స్ ప్రక్రియ లో కచ్చితంగా స్నేహాలను పక్కన పెట్టి చెయ్యాలి.మొదటి వారం నుండి తిట్టుకుంటూ నామినేషన్స్ వేసుకున్న అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ గత కొంత కాలం నుండి మంచి స్నేహితులుగా ఉంటున్నారు.

అమర్ దీప్ ముందుగా పల్లవి ప్రశాంత్ కి( Pallavi Prashant ) నువ్వు కెప్టెన్ అయ్యే పరిస్థితి నా చేతుల్లో ఉంటే కచ్చితంగా నిన్ను కెప్టెన్ ని చేస్తాను అని మాట ఇచ్చాడు.పల్లవి ప్రశాంత్ కూడా అమర్ కి అలాంటి మాటనే ఇచ్చాడు.ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ గత వారం అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యలేదు.ఇచ్చిన మాట ప్రకారం సపోర్ట్ చేసాడు.అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్ లో ( Nominations ) అమర్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ముందుగా అమర్ ప్రశాంత్ ని పిలుస్తాడు.
ప్రశాంత్ ఏడుస్తూ ఉండడం తో, సరే వెళ్లు, నేను నామినేషన్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని అంటాడు.ఇద్దరి మధ్య కాస్త వాదన జరుగుద్ది.
మరి అమర్ ప్రశాంత్ ని నామినేట్ చేశాడా లేదా అనేది ఈరోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్ లో తెలుస్తాది.

ఇకపోతే శివాజీ ని( Shivaji ) కూడా హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసారు.ముఖ్యంగా శివాజీ కన్నింగ్ వేషాలను మొత్తం నేడు గౌతమ్( Gautam ) బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇది ఆయనకీ పాజిటివ్ గా మారొచ్చు, అదే సమయం లో నెగటివ్ కూడా అవ్వొచ్చు.
ఇక ప్రియాంక ( Priyanka ) విషయం లో మాత్రం మొన్న నాగార్జున ముందు శివాజీ చేసింది ముమ్మాటికీ తప్పే.గుడ్డ కాల్చి మీద వేసి వెళ్లిపోవడం శివాజీ స్టైల్, ఎందుకు కాల్చాను?, కారణాలు ఏమిటి అనేది మాత్రం చెప్పడు.ప్రియాంక విషయం లో గత వారం ఆయన చేసింది అదే.మరి ఆమె తన పాయింట్స్ ని కరెక్ట్ గా అడిగిందో లేదో చూడాలి.