బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోపై గత సీజన్లకు భిన్నంగా ఓటింగ్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ ప్రేక్షకుల ఓటింగ్ ను పట్టించుకోకుండా కొందరిని సేవ్ చేస్తూ వారికి బదులుగా వేరేవాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
దేవి నాగవల్లి, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, దివి ఎలిమినేషన్ సమయంలో బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో మోసం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం ఓటింగ్ విషయంలో ఏదో మోసం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్ కు ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని వెల్లడించడు.ప్రేక్షకుల నుంచి తక్కువ సంఖ్యలో ఓట్లు వస్తే షోపై ఓట్ల ప్రభావం పడే అవకాశం ఉందని భావించి ఆ విషయాలను చెప్పరు.
అయితే చాలామంది కంటెస్టెంట్ల ఓటింగ్ పై అనుమానాలు నెలకొన్నాయి.
దీంతో పరోక్షంగా నాగార్జున స్పందించి నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఓటింగ్ పై నెలకొన్న అనుమానాల గురించి స్పష్టతనిచ్చారు.
ముఖ్యంగా మోనాల్ ను బిగ్ బాస్ నిర్వాహకులు సేవ్ చేస్తున్నారని బిగ్ బాస్ షోను ట్రోల్ చేస్తూ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు జనాలు వేసే ఓట్ల ద్వారా మాత్రమే సేవ్ అవుతారని తెలిపారు.థర్డ్ పార్టీ ఓట్లను అడిట్ చేస్తుందని.
ఓటింగ్ విషయంలో సందేహాలు అవసరం లేదని అన్నారు.
మరోవైపు బిగ్ బాస్ షో రేటింగ్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తొలివారం రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించిన బిగ్ బాస్ షో ప్రస్తుతం సాధారణ సీరియళ్ల స్థాయిలో రేటింగ్ లు వస్తున్నాయి.బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచలేకపోతే రాబోయే వారాల్లో రేటింగ్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.