టెక్సాస్ నరమేధం : ఉక్రెయిన్‌ కాదు.. ముందు మన స్కూళ్ల సంగతి చూడండి, బైడెన్‌పై ట్రంప్ ఆగ్రహం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఉన్మాది జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని గన్ కల్చర్‌పై మరోసారి చర్చ జరుగుతోంది.

 Biden Should Prioritise Funding For School Security Over Aid To Ukraine Said Don-TeluguStop.com

డెమొక్రాట్లు తుపాకుల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.రిపబ్లికన్లు మాత్రం గన్ లాబీకి మద్ధతుగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఉక్రెయిన్‌కు నిధుల‌ను ఇవ్వ‌డం కాదు.

ముందు అమెరికాలోని స్కూళ్ల‌లో భ‌ద్ర‌త‌ను పెంచేందుకు నిధుల‌ను కేటాయించాల‌ని ట్రంప్ డిమాండ్ చేశారు.అమెరికాకు చెందిన నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ హూస్ట‌న్‌లో నిర్వహించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ… ఉక్రెయిన్‌కు బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఇవ్వ‌గ‌లిగిన‌ప్పుడు, మ‌న ఇంట్లో మ‌న పిల్ల‌ల్ని సుర‌క్షితంగా ఉంచేందుకు కూడా అవసరమైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

ఇరాక్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని, కానీ అక్క‌డ లభించింది శూన్యమని ట్రంప్ గుర్తుచేశారు.బయటి దేశాల‌ను చ‌క్క‌దిద్ద‌డం క‌న్నా ముందు అమెరికాలోని స్కూళ్ల‌ను పిల్ల‌ల‌కు సుర‌క్షితంగా ఉండేలా మార్చుకోవాల‌ని చురకలు వేశారు.

ఇదే సమయంలో దేశంలో క‌ఠిన తుపాకీ చ‌ట్టాల అమ‌లును ట్రంప్ వ్య‌తిరేకించారు.ప్రజలు తమను తాము ర‌క్షించుకునేందుకు ఆయుధాలు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

Telugu Bidenprioritise, Donald Trump, Houston, National Rifle, Joe Biden, Ukrain

కాగా.ర‌ష్యా దురాక్రమణతో పీకల్లోతు ఇబ్బందుల్లో చిక్కుకున్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు అమెరికా ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే.ఆ దేశానికి 40 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా చ‌ట్ట‌స‌భ‌లు ఆమోదించిన బిల్లుపై జో బైడెన్ గత వారం సంత‌కం చేశారు.అమెరికా అందించే ఈ సాయంలో స‌గం మిలిట‌రీ అవ‌స‌రాల‌కే ఉప‌యోగించనున్నారు.

సెప్టెంబ‌ర్ నాటికి ఉక్రెయిన్‌కు ఈ నిధులు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే ఉక్రెయిన్‌కు అమెరికా 13.6 బిలియ‌న్ డాల‌ర్ల అత్య‌వ‌స‌ర సాయం అంద‌జేసింది.ఈ నేపథ్యంలో బైడెన్ తీరుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube