అమెరికా : జో బైడెన్ జట్టులో మరో ఇండో అమెరికన్.. ఎవరీ రిచర్డ్ వర్మ..?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్.మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ.

 Biden Announces Intent To Appoint Ex-us Ambassador To India Richard Verma To His-TeluguStop.com

ఇటీవల మళ్లీ ఆయన ఉన్నత పదవుల్లో భారతీయులను నియమిస్తున్నారు.తాజాగా తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా భారత సంతతికి చెందిన న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మను నియమిస్తున్నట్లు తెలిపారు బైడెన్.

ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ.

బుధవారం విడుదల చేసిన వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం.జో బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో వర్మను నియమిస్తున్నట్లు తన ఉద్దేశ్యాన్ని తెలిపారు.52 ఏళ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.

Telugu America, Bidenambassador, Joe Biden, Johnstown, Pennsylvania, Richard Ver

రిచర్డ్ వర్మ తల్లిదండ్రులు భారత్ నుంచి 1960వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు.ఆయన తండ్రి దాదాపు నలభై ఏళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ పీట్స్‌బర్గ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.వర్మ తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడం విశేషం.జాన్స్‌టౌన్, పెన్సిల్వేనియాలలో రిచర్డ్ వర్మ పెరిగారు.వెస్ట్‌మాంట్ హిల్‌టాప్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎం, వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో జేడీ, లెహి వర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube