"నిజం గెలవాలి" పేరుతో జనంలోకి రాబోతున్న నారా భువనేశ్వరి..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) అయి నెల రోజులకు పైగా కావస్తోంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 Bhuvaneshwari Key Decision In The Wake Of Chandrababu Arrest, Tdp, Nara Bhuvanes-TeluguStop.com

ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP Leaders ) రకరకాల నిరసనల కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.రాజకీయ కక్షతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneswari ) కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

విషయంలోకి వెళ్తే “నిజం గెలవాలి”( Nijam Gelavali ) పేరుతో వచ్చేవారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటించడానికి రెడీ కావడం జరిగింది.ఈ పర్యటనలో చంద్రబాబు అరెస్ట్ కారణంగా మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.వారంలో కనీసం రెండు, మూడు చోట్ల పర్యటనలు ఉండేలా టీడీపీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు జైలు నుంచి విడుదల అవ్వగానే లోకేష్( Lokesh ) యధావిధిగా మళ్లీ పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి సతీమణి భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ ఉన్నారు.

ఈ క్రమంలో పలుమార్లు ములఖాత్ లో చంద్రబాబుతో భేటీ కావడం జరిగింది.కాగా సడెన్ గా భువనేశ్వరి ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube