“నిజం గెలవాలి” పేరుతో జనంలోకి రాబోతున్న నారా భువనేశ్వరి..!!
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) అయి నెల రోజులకు పైగా కావస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP Leaders ) రకరకాల నిరసనల కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
రాజకీయ కక్షతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneswari ) కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
"""/"/
విషయంలోకి వెళ్తే "నిజం గెలవాలి"( Nijam Gelavali ) పేరుతో వచ్చేవారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటించడానికి రెడీ కావడం జరిగింది.
ఈ పర్యటనలో చంద్రబాబు అరెస్ట్ కారణంగా మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.వారంలో కనీసం రెండు, మూడు చోట్ల పర్యటనలు ఉండేలా టీడీపీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు జైలు నుంచి విడుదల అవ్వగానే లోకేష్( Lokesh ) యధావిధిగా మళ్లీ పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి సతీమణి భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ ఉన్నారు.
ఈ క్రమంలో పలుమార్లు ములఖాత్ లో చంద్రబాబుతో భేటీ కావడం జరిగింది.కాగా సడెన్ గా భువనేశ్వరి ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో సంచలనం సృష్టించింది.
అల్లు అర్జున్ అరెస్టుపై వేణు స్వామి భార్య షాకింగ్ కామెంట్స్… నేను ముందే చెప్పానంటూ?