కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్యామ్ అలియాస్ శంబయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తన మరణానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ సీఐ గోపీకృష్ణ కారణమని ఆరోపిస్తూ సూసైడ్ లెటర్ రాశాడు.భూమి విషయంలో సీఐ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
సీఐ వలన తన కుటుంబానికి ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నాడు.ఈ క్రమంలో తన డైరీని ఎస్పీతో పాటు కలెక్టర్ కు అందించాలని సూసైడ్ నోటులో వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.