తెలుగులో “ఫోటో” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయం అయిన “మలయాళ బ్యూటీ ముక్త అలియాస్ భానుమతి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ముక్త తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా తమిళ ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వం వహించిన “భరణి” అనే చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది.
అయితే ఈ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించడమే కాకుండా భానుమతికి మంచి గుర్తింపు తెచ్చింది.
అయితే భానుమతి మలయాళం తమిళంలో ఒకనొక సమయంలో చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా రాణించింది.
ఆ తరువాత ఈ అమ్మడు కొంతమేర బరువు పెరగడంతో హీరోయిన్ గా సినీ అవకాశాలు కరువయ్యాయి.ఇక సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మరియు వ్యాఖ్యాత రిమి టోమి సోదరుడు రుంకీ టోమి ని పెళ్లి చేసుకుంది.
అయితే ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటించింది.కాగా ప్రస్తుతం భానుమతి తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ లోని త్రివేండ్రంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
అయితే సినిమా అవకాశాలు కరువైన తరువాత నటి భానుమతి సీరియళ్లలో నటించేందుకు ఆసక్తి చూపింది. ఇందులో భాగంగా మలయాళం,తమిళం, తెలుగు తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు సీరియళ్లలో నటించింది.
కాగా ప్రస్తుతం “కూడతాయి” అనే ఓ మలయాళం సీరియల్ లో నటిస్తోంది. అంతేగాక అప్పుడప్పుడు పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.