మామూలుగా ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఓ తండ్రి కసాయిగా మారి తనకు పుట్టినటువంటి కవల పిల్లలను తన గ్రామం పరిసర ప్రాంతం లో ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి గొంతు నులిమి ఆత్మ హత్య చేసి పాతి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కి చెందినటువంటి కళ్యాణదుర్గం మండలం లోని ఓ ప్రాంతంలో రవి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడికి ఈ మధ్యకాలంలో కొంతమేర మతి స్థిమితం సరిగా ఉండటం లేదు.
దీంతో ఎలాంటి పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో పలు మానసిక రుగ్మతలకు గురై అసలు తాను ఏం చేస్తున్నాడనే సోయ లేకుండా అప్పుడప్పుడు ప్రవర్తించేవాడు.
దీంతో తాజాగా తన కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్ళగా తన ఇద్దరు కవల పిల్లలను గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అడవి లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి అక్కడే పాతిపెట్టి ఏమి ఎరగనట్లు ఇంటికి వచ్చేశాడు.
దీంతో పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో రవి భార్య రాధమ్మ అతడిని ఈ విషయంపై నిలదీయడంతో అతడు నిజం చెప్పాడు. దీంతో ఆమె బోరున విలపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.