ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.కొద్దిరోజుల రాష్ట్రంలో కరోనా కేసులు 5 వేలకంటే తక్కువగానే నమోదవుతున్నాయి.
గత కొన్ని రోజుల ముందు వరకు ఏపీలో వరుసగా పది వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇకపోతే, తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం .గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 4038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 771503కు చేరుకుంది.
తాజాగా వెల్లడైన పాజిటివ్ కేసుల్లో .అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 96 కేసులు నమోదు అయ్యాయి.అలాగే , రాష్ట్రంలో కొత్తగా 38 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు.చిత్తూరు జిల్లాలో 9, ప్రకాశంలో 7, కృష్ణాలో 5, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 3, కడపలో 3, విశాఖ 3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
దీంతో ఏపీలో కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6357కు చేరింది.రాష్ట్రంలో కొత్తగా 5622 మంది కరోనా నుంచి కోలుకోగా.ఇప్పటివరకు ఏపీలో మొత్తం 725099 మంది ఈ వైరస్‌ను జయించారు.
.