ఎస్పీ శైలజ : ఆ సీన్ లో నటించేటప్పుడు నా భర్తని గన్ తో షూట్ చేయమని చెప్పా... కానీ..

తెలుగులో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వం వహించిన “సీతాకోక చిలుక” చిత్రంలో “మాటే మంత్రము” అనే పాటతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ తెలుగు “ప్లే బ్యాక్ సింగర్ ఎస్పి.శైలజ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సింగర్ ఎస్.పి.శైలజ ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెల్లెలు అయినప్పటికీ ఆమె సొంతంగా సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు దక్కించుకొని బాగానే రాణించింది.అయితే తాజాగా ఎస్.

 Telugu Senior Singer Sp Sailaja React About Her Struggles In Real Life, Singer S-TeluguStop.com

పి.శైలజ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తన తల్లిదండ్రులు తనకి పెళ్లి చేస్తున్నట్లు మారు మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసేశారని ఆ విషయంలో కొంతమేర తన తల్లిదండ్రులుపై మొదట్లో కోపం వచ్చినప్పటికీ మంచి మనసు ఉన్నటువంటి భర్త దొరకడంతో తన అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి థాంక్స్ చెప్పానని తెలిపింది.

 అయితే పెళ్లయిన తర్వాత కొంతకాలానికే కష్టాలను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని కానీ తమ కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో సాయం కోసం ఎవరి దగ్గరికీ వెళ్లలేదని కేవలం తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అర్థం చేసుకునే గుణం కారణంగానే ఇద్దరూ కలిసి సమస్యలను అధిగమించి ప్రస్తుతం బాగానే రాణిస్తున్నామని చెప్పుకొచ్చింది.

 అప్పట్లో లో తమిళ నటి గౌతమితో కలిసి నటించినటువంటి ఓ సన్నివేశం బాగా పాపులర్ అయింది.

 అయితే ఆ సన్నివేశంలో శుభలేఖ సుధాకర్ గౌతమీ పై అత్యాచారం చేస్తున్నట్లు నటించాడు. అయితే ఆ సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో తను అక్కడే ఉన్నానని దాంతో సుధాకర్ అలా చేస్తుండడంతో నటి గౌతమితో వెంటనే అతడిని తన పక్కనే ఉన్న గన్ తీసుకుని కాల్చెయమని చెప్పేసానని చెప్పుకొచ్చింది. 

ఆ తరువాత తన భర్త శుభలేఖ సుధాకర్ తనని సముదాయించాడని తెలిపింది. ఆ తర్వాత మళ్ళీ తన భర్త నటించినఆ చిత్రం ఇప్పటి వరకు చూడలేదని  కూడా చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్.పి.శైలజ తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప ఛాంపియన్స్ అనే మ్యూజిక్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube