తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించినటువంటి “నువ్వు నేను” అనే చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ కి జంటగా నటించి తెలుగు సినిమా హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులని బాగానే అలరించింది.

 Telugu Veteran Actress Anita Hassanandani Officially Announced Her Pregnancy,ani-TeluguStop.com

దీంతో తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటోంది.

 దీంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

అయితే సినిమా అవకాశాలు కొంతమేర తగ్గిన సమయంలో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించి సినిమా పరిశ్రమకు చెందిన రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే తాజాగా అనిత తాను తల్లి కాబోతున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.దీంతో పలువురు సెలబ్రిటీలు మరియు సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

అయితే తెలుగులో అనిత హీరోయిన్ గా నటించిన నువ్వు నేను,  తొట్టి గ్యాంగ్, ఆడంతే అదో టైపు, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

కాగా ప్రస్తుతం అనిత ఒకపక్క పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరో పక్క హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది.

 ఇందులో ముఖ్యంగా నాగిని సీరియల్ ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.  కాగా ప్రస్తుతం నాగిని 5వ సీజన్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube