ఈ ఫోన్స్ కంపాక్ట్ సైజు ఉంటాయి కానీ పర్ఫామెన్స్‌లో మాత్రం తోపులు..!

చేతిలో, జేబులో సరిపోయే చిన్న ఫోన్ కావాలని చాలామంది కోరుకుంటారు.అదే సమయంలో మంచి పర్ఫామెన్స్ కావాలని కూడా ఆశిస్తారు.

 Best Compact Smartphones With Top Performance Available In The Market Details, S-TeluguStop.com

కానీ ఈ రోజుల్లో చాలా ఫోన్లు పెద్దవిగా, హెవీ వెయిట్‌తో వస్తున్నాయి.అయితే మొబైల్ మార్కెట్‌ను జల్లెడ పడితే కొన్ని కాంపాక్ట్ ఫోన్లు( Compact Phones ) దొరుకుతాయి.

అవి అదిరిపోయే పర్ఫామెన్స్ కూడా ఆఫర్ చేస్తాయి.ధర, పర్ఫామెన్స్ పరంగా అవి బెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్స్‌గా నిలుస్తున్నాయి.మరి ఆ ఫోన్స్‌ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

• నోకియా 2660 ఫ్లిప్ (రూ.4,449)

ఇది కాల్, టెక్స్ట్, ఫొటోలు తీయడం, రేడియో ప్లే చేయగల బేసిక్ ఫీచర్ ఫోన్.ఇది 0.3 MP కెమెరా, 2.8-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.ఇది క్లాసిక్ నోకియా వలె ఓపెన్ అయి క్లోజ్ అవుతుంది.ఈ ప్రైస్‌ రేంజ్‌లో దీనంత పెర్ఫార్మన్స్ అందించే మరో ఫోన్ లేదని చెప్పవచ్చు.డ్యూయల్ స్క్రీన్‌తో( Dual Screen ) వచ్చే ఈ మొబైల్ 4G కనెక్టివిటీ ని కూడా ఆఫర్ చేస్తుంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 20% డిస్కౌంట్‌తో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

Telugu Nokia Phone, Compact, Latest, Motorola Edge, Oneplus Nord, Samsung Galaxy

• మోటో G14 (రూ.8,499)

ఇది సన్నగా, తేలికగా ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.( Budget Smartphone ) ఇది 6.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది ఆ రేంజ్‌లో చాలా ఫోన్‌ల కంటే చిన్నది.5,000ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, యూనిసోక్ టైగర్ T616 ప్రాసెసర్‌తో ఈ మొబైల్ రన్ అవుతుంది.

Telugu Nokia Phone, Compact, Latest, Motorola Edge, Oneplus Nord, Samsung Galaxy

• ఐకూ Z7 (రూ.18,999)

ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1300 nits బ్రైట్‌నెస్‌తో 6.38-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్న కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్.దీని బరువు కేవలం 173 గ్రాములు, మందం 7.8 మి.మీ.కాబట్టి దీనిని ఒక కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ అని పిలవచ్చు.ఇందులో శక్తివంతమైన డైమెన్సిటీ 920 ప్రాసెసర్, మంచి కెమెరా సిస్టమ్ ఉంది.

Telugu Nokia Phone, Compact, Latest, Motorola Edge, Oneplus Nord, Samsung Galaxy

• వన్‌ప్లస్ నార్డ్ 2T (రూ.28,999)

ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉన్న మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.ఇది డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ని( Dimensity 1300 Processor ) కలిగి ఉంది, ఈ ప్రాసెసర్ ఫాస్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది.ఇక ఈ మొబైల్‌ 32 MP సెల్ఫీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంది.

Telugu Nokia Phone, Compact, Latest, Motorola Edge, Oneplus Nord, Samsung Galaxy

• మోటరోలా ఎడ్జ్ 40 (రూ.26,999)

ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉన్న మరొక మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.దీని బరువు కేవలం 167 గ్రాములు, మందం 7.9 మి.మీ.ఇది స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Telugu Nokia Phone, Compact, Latest, Motorola Edge, Oneplus Nord, Samsung Galaxy

• శామ్‌సంగ్ గెలాక్సీ S22 (రూ.49,999)

ఇది 120Hz రిఫ్రెష్ రేట్, QHD+ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.ఇది Exynos 2200 ప్రాసెసర్‌తో ఫాస్టెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.ఇలాంటి పర్ఫామెన్స్ తక్కువ సైజు ఉన్న ఫోన్ పొందాలనుకునే వారికి ఈ ఫోన్ ఉత్తమ ఛాయిస్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube