ఐటీ దాడుల విషయంలో టీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సెటైర్లు వేశారు.అక్రమంగా ప్రజలను దోచుకుంటూ ఆస్తులు సంపాదించుకునే వారిని కంట్రోల్ చేయొద్దా అని అడిగారు.
దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.ఐటీ దాడులను పార్టీలకు ఆపాదించడం సరికాదన్న బండి సంజయ్.
దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందన్నారు.నిజాయితీ పరులైతే రుజువు చేసుకోండని హితవు పలికారు.
అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే రాజకీయంగా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.