తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తమ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని తెలిపారు.
ఇందులో భాగంగా రేపు పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై స్వయంగా వివరాలు సేకరించాలని పార్టీ నేతలకు సూచించారు.ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు అందజేయాలని చెప్పారు.
ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.అదేవిధంగా మన్ కీ బాత్ వందవ ఎపిసోడ్ ను సక్సెస్ చేయాలన్నారు.
ఇందుకోసం గ్రామాల్లో టీవీ, స్క్రీన్లు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలందరూ మన్ కీ బాత్ కార్యక్రమాలు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.