వైఎస్ కుటుంబంపై టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమన్నారు.
గతంలో షర్మిల కూడా తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చారని చెప్పారు.ఆడబిడ్డను అరెస్ట్ చేస్తారా అని కొందరు అంటున్నారన్న ఆయన షర్మిల సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మగతనం ఉందా అని ఆడబిడ్డ మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.షర్మిల నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు.తెలంగాణలో షర్మిలను నమ్మే వారు ఎవరి లేరని బాల్క సుమన్ పేర్కొన్నారు.