అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు.ఆయన నటించిన వీరాసింహా రెడ్డి సినిమా శత దినోత్సవ కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు.
దీంతో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈనెల 23 వ తేదీ ఎంజీఎం గ్రౌండ్ లో నిర్వహించాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు.
అయితే హిందూపురం మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగడంతో పాటు రోడ్డుపై బైఠాయించారు.
సినిమా వేడుకను రాజకీయం చేయొద్దంటూ అభిమానులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.