నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న బోయపాటి శ్రీను మూవీ టైటిల్ విషయంలో గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.సూపర్ మ్యాన్ నుండి మొదలుకుని మోనార్క్ వరకు ఎన్నో టైటిల్స్ ను సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అందులో ఏది ఫైనల్ అవ్వబోతుంది అనే విషయంలో ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే జరుపుతున్నారు కాని దర్శకుడు బోయపాటి ఇప్పటి వరకు టైటిల్ ఏంటో చెప్పలేదు.
విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిన బోయపాటి టైటిల్ పై నిర్ణయం తీసుకోలేక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన సింహా మరియు లెజెండ్ సినిమా లను అందించిన ఈ కాంబో ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించడం ఖాయం అంటున్నారు.
బాలయ్య మరియు బోయపాటి ల కాంబో మూవీ పై అంచనాలు స్వతహాగానే భారీగా ఉన్నాయి.కనుక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టైటిల్ ఉండాలనే ఉద్దేశ్యంతో సుదీర్ఘ కాలంగా టైటిల్ గురించి చర్చలు జరుపుతున్నారు.
రెండు మూడు టైటిల్స్ ను ఖరారు చేశారట.వాటిలో నుండి ఒకదాన్ని త్వరలోనే ఓకే చేసి అధికారికంగా ప్రకటిస్తారని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు కూడా చెప్పారు.
నిర్మాత మిర్యాల రాజేందర్ మాట్లాడుతూ తప్పకుండా ఒక మంచి టైటిల్ ను బాలయ్య ఇమేజ్ కు తగ్గ పవర్ ఫుల్ మాస్ టైటిల్ ను ప్రకటిస్తామని చెప్పాడు.ఆయన ఇప్పటికే మోనార్క్ తో పాటు మరో రెండు టైటిల్స్ ను రిజిస్ట్రర్ చేయించాడట.
ఆ సినిమా టైటిల్స్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
సినిమా ను మే 28న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.