మన శరరీంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.రక్తాన్ని శుద్ధి చేసి అనవసరమైన వ్యర్థాలను, విషతుల్యాలను మూత్రం ద్వారా బయటకు తోయడమే కిడ్నీలు చేసే ముఖ్య పని.
అందుకే అవి బాగుంటేనే మనం బాగుంటాం అని అంటుంటారు.ఒకవేళ కిడ్నీ పని చేయడం లేదంటే.
వైద్యులు డయాలసిస్ చేసి ఆర్టి ఫిషియల్ గా శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తారు.ఇక ఇటీవల కాలంలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.
అయితే డయాలసిస్ చేయించుకునే వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆహార విషయంలో అనేక నియమాలు పాటించాలి .ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.మరి ఆ ఆహారాలు ఏంటో.? డయాలసిస్ చేయించుకునే వారు వాటిని ఎందుకు తినకూడదో.? ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, పెరుగు, వెన్న వంటి డైరీ ప్రోడెక్ట్స్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్ వాటిని చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే, వాటిల్లో అధిక మొత్తంలో ఉండే పొటాషియం కిడ్నీలను మరింత తీవ్రంగా దెబ్బ తీస్తాయి.డయాలసిస్ చేయించుకునే వారు దుంప జాతికి చెందిన క్యారెట్, బంగాళ దుంప, చిలకడ దుంప, బీట్ రూట్ వంటి వాటిని తీసుకోవడం కీడ్నీలకు ఏ మాత్రం మంచిది కాదు.
కాబట్టి, వాటిని ఎవైడ్ చేయడమే మంచిది.
అలాగే డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్ తృణధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎట్టి పరిస్థితి లో తినకూడదు.ఉప్పు తీసుకోవడం బాగా తగ్గించాలి.డిసర్ట్స్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ప్యాక్డ్ ఫుడ్స్, అరటి పండ్లు, అవకాడో, కివి, సలాడ్స్, నట్స్, పీనట్ బటర్, బీన్స్ వంటి వాటిని పొరపాటున కూడా తీసుకోరాదు.
ఇటువంటి ఆహారాల్లో పొటాషియం మరియు ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.అందువల్ల, వీటిని తీసుకుంటే కిడ్నీలు మరింత ఎఫెక్ట్ అవుతాయి.